కేబినెట్ నుంచి తొలగింపు.. కొండా సురేఖ ఏమన్నారంటే?

03-09-2026 Thu 15:53 | Telangana
Advertisement
  • కేబినెట్ నుంచి తనను తొలగించడాన్ని ఖండించిన కొండా సురేఖ
  • వివరణ అడగకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆవేదన
  • కూతురి వ్యాఖ్యలకు నేను బాధ్యురాలిని కాదంటూ స్పష్టీకరణ
  • జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలేవని సూటి ప్రశ్న
Advertisement
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్‌కు సిఫార్సు చేసిన నేపథ్యంలో, ఈ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం తన వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా ఇటువంటి చర్యలు తీసుకోవడం భావ్యం కాదని ఆమె ఆక్షేపించారు.

ఇటీవల తన కుమార్తె చేసిన వ్యాఖ్యల వల్ల తలెత్తిన వివాదంపై ఆమె స్పందిస్తూ, "నా కుమార్తె స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలకు నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఆమె వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం నాకు లేదు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు" అని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను సమర్పించిన లేఖను త్వరలోనే మీడియాకు విడుదల చేస్తానని ఆమె వెల్లడించారు.

గతంలో జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. కాగా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు లేఖ రాశారు. కొండా సురేఖ రాజీనామాకు నిరాకరించడంతో, ఆమెను బర్తరఫ్‌ చేయడానికే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.
Advertisement
Konda SurekhaRevanth ReddyTelangana CabinetTelangana CongressKonda Surekha Dismissal

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more